Wednesday, October 23, 2024
spot_img
HomeNationalతెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఎవ్వరు?

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఎవ్వరు?

న్యూ ఢిల్లీ :

కేంద్రంలో ఏర్పాటు కాబోయే సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ కు త్వరలో పూర్తిస్థాయి గవర్నర్ ను నియమించ నుంది. ప్రస్తుత ఇన్ చార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. పుదుచ్చేరి, జార్ఖండ్ గవర్నర్​గా కొనసాగుతు న్నారు.

దీంతో మూడు రాష్ట్రాల మధ్య పర్యటించాల్సి వస్తోందని, ఇది కొంత ఇబ్బందిగా ఉందని రాధాకృష్ణన్ పలు కార్యక్రమాల్లో చెప్పారు. మార్చి 19న తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనా మా నేపథ్యంలో జార్ఖండ్​ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనంగా తెలంగాణ, పుదుచ్చేరిల ఇన్​చార్జి బాధ్యతలను కేంద్రం అప్పగించింది.

ఎన్నికలు పూర్తికావటంతో త్వరలో ప్రధాని, కేంద్రమంత్రి మండలి, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించ నుంది. అదనపు బాధ్యత లు నిర్వర్తిస్తున్న వారికి ఇన్ చార్జ్ బాధ్యతలు తొలగించి ఆ స్థానాల్లో కొత్త గవర్నర్లను నియమించనుంది.

ఇటీవల ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన సిట్టింగ్ ఎంపీ లకు ప్రస్తుతం గవర్నర్లుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇటీవలి దాకా రాష్ట్ర గవర్నర్ గా వ్యవహ రించిన తమిళిసైకు బీజేపీ హైకమాండ్​ కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ పదవికి రాజీనామా చేసి చెన్నై సౌత్​నుంచి ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, డీఎంకే అభ్యర్థి చేతిలో తమిళిసై ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తమిళిసైని రాజ్యసభకు పంపించి, ఆపై కేబినెట్ లోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket