Wednesday, October 23, 2024
spot_img
HomeAndhra Pradeshఘనంగా ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ అధినేత డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఐజి బి. వెంకటరామిరెడ్డి గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అక్టోబర్ 20, 2024న “APSPF Sports meet 2024” ను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు అక్టోబర్ 20 నుండి 23వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి మూడు రోజులు 202 మంది సిబ్బందికి క్రీడలు మరియు ఆటలు అయినటువంటి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, మరియు 5,000 మీటర్ల పరుగు పందాలు నిర్వహించబడి, చివరి రోజున ముగింపు కార్యక్రమలో విజేతలకు రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలాపూడి అనిత గారు, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కుమార్ విశ్వజిత్, ఐపిఎస్, మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్ వార్ల చేతుల మీదగా బహుమతుల ప్రదాన కార్యక్రమం జరగనుంది.

ఐజి బి. వెంకటరామిరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడలు సిబ్బందిలో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, వారి శారీరక మరియు మానసిక ధృడత్వాన్ని పెంపొందించడంలో ఎంతగానో సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. “ఈ పోటీలు విజయాన్ని మాత్రమే కాకుండా, సమష్టిగా పనిచేయడం, క్రమశిక్షణ, క్రీడాస్పూర్తి వంటి విలువలను పెంచే ప్రయత్నం,” అని ఆయన అన్నారు.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధినేత డాక్టర్ త్రివిక్రమ వర్మ ఐపీఎస్ గారు, సిబ్బందిలో శారీరక, మానసిక దృఢత్వం మరియూ క్రీడా స్ఫూర్తిని పెంచేదుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేసారు.

అలాగే ఈ కార్యక్రమంకు విజయవాడ జోన్ కమాండెంట్ ఎం. శంకర్రావు, అసిస్టెంట్ కమాండెంట్లు అయినటువంటి కె. కృష్ణమూర్తి, బి. శ్రీనివాసరావు, పి.వి.ఎస్.ఎన్. మల్లికార్జునరావు, టి. కృష్ణమాచారి, కె. శ్రీనివాసులు మరియు టి. కామేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. అలాగే, ఇన్స్పెక్టర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్లు కూడా పాల్గొన్నారు.

ప్రారంభ వేడుకలో భాగంగా ఈరోజు ఓపెనింగ్ సెరిమని మరియు మార్చిపాస్ట్ నిర్వహించబడింది. 100 మీటర్లు మరియు 400 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు.

విజేతల వివరాలు:
100 మీటర్ల పందెం: 1వ స్థానం: M.S. చక్రవర్తి (పిసి 3452)
2వ స్థానం: R. రంజిత్ కుమార్ (పిసి 5716)
3వ స్థానం: ఏ. మహేష్ (పిసి 5872)

400 మీటర్ల పందెం: 1వ స్థానం: పి. పెంటయ్య (పిసి 3978)
2వ స్థానం: M. నారాయణ రావు (పిసి 5698)
3వ స్థానం: ఏ. మహేష్ (పిసి 5872).

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket