Wednesday, October 23, 2024
spot_img
HomeTelanganaతెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా

తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా

ఈ నెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం

రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం

సమావేశం వాయిదా పడినట్లు వెల్లడించిన సీఎస్

ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని వెల్లడించారు. కేబినెట్ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ కేబినెట్ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతుభరోసా తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket