Thursday, May 9, 2024
spot_img
HomeAndhra Pradeshప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అది చేయడమే ప్రజా ప్రతినిధులుగా మన బాధ్యత: ఎంపీ కేశినేని...

ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అది చేయడమే ప్రజా ప్రతినిధులుగా మన బాధ్యత: ఎంపీ కేశినేని నాని

ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుని కార్యాలయం కేశినేని భవన్ వద్ద మైలవరం నియోజకవర్గంలోని 12 గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లను ఎంపీ కేశినేని నాని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ

తుఫాను సందర్భంగా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని తరువాత కూడా తుఫాను బాధితులు, నష్టపోయిన రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని ఆదుకోవడంలో విఫలమైన జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అది చేయడమే ప్రజా ప్రతినిధులుగా మన బాధ్యత

అన్న ఎన్టీఆర్, చంద్రబాబు గారు నేర్పించిన బాటలో ప్రజాప్రతినిధులుగా ముందుకు వెళ్తున్నాం

నిరంతరం ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నా

విజయవాడ పార్లమెంటు పరిధిలో మంచినీటి ఎద్దడి ఉండడంతో ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ ను ఇచ్చే బాధ్యతను తీసుకున్నా

చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేయడం వల్ల కొన్నాళ్లపాటు ట్యాంకర్ లు విడుదల చేయడం ఆపాము

ఇప్పటికే 120 గ్రామాల వరకు వాటర్ ట్యాంకర్లు అందించాం ఫిబ్రవరి కి నీటి ఎద్దడి మొదలవుతుంది కాబట్టి మిగిలిన 160 గ్రామాలకు కూడా జనవరిలోగా టాంకర్లు అందిస్తాం

అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో వాటర్ ట్యాంకర్ లు, ఓవర్ హెడ్ ట్యాంకులకు 13 కోట్లు కేటాయించి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం

ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం విజయవాడ ప్రజలు, నారా చంద్రబాబునాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చారు

మైలవరం నియోజకవర్గం లోని మద్దులపర్వ, అన్నెరావుపేట, రెడ్డిగూడెం, కూనపరాజుపర్వ, రంగాపురం, మైలవరం, పొందుగుల, పుల్లూరు, కె.తాడేపల్లి, జక్కంపూడి, గొల్లపూడి, రాయనపాడు గ్రామాల ప్రజల త్రాగునీటి అవసరార్థం వాటర్ ట్యాంకర్లు అందజేత

మిచౌంగ్ తుఫాను మన రాష్ట్ర రైతాంగ జీవితాలను అతలాకుతలం చేసింది

వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, మామిడి సహా అన్ని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి

లక్షలాది ఎకరాల్లో పంట నాశనమయింది.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో వేల ఎకరాలలో పంట దెబ్బతింది

వరి రైతు ఎకరానికి రూ.40,000/- వరకు నష్టపోయాడు
రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమయ్యింది

తుఫాను దృష్ట్యా అప్రమత్తం చేయడం ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది

హుద్ హుద్, తిత్లి తుఫానుల సమయంలో జనజీవనం సాధారణ స్థితికి వచ్చేవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్య ఉండి రాత్రి బస్సులో బస చేసి వారికి ధైర్యం కల్పించారు

బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాను తీరం దాటుతోందని తెలిసినా.. నిర్లక్ష్యంగా రైతులను, ప్రజలను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉండటానికి అనర్హులు

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని జరిగిన నష్టాన్ని వివరించాను

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని కాబట్టి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారు

ప్రజలను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైనందున తక్షణ సాయం కింద ఐదు వేల కోట్లు ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ లో డిమాండ్ చేశారు

అసలే కరువుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఈ తుఫాను వల్ల భారీగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం కోరారు

రైతులు, పేద ప్రజల పట్ల ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సానుకూలంగా ఉండి వారి తరుపున పోరాటం చేస్తుంది

బాధితులను రైతులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైనా తెలుగుదేశం పార్టీ తరఫున ఢిల్లీ నుంచి గల్లి వరకు పోరాటం చేసి వారిని ఆదుకుంటాం

ఈ ప్రభుత్వం సహాయం చేయకపోయినా నాలుగు నెలల్లో తెలుగుదేశం పార్టీ వచ్చాక ఆదుకుంటామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా),ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య, డిప్యూటీ మేయర్ గోగుల రమణ, రాష్ట్ర తెలుగు రైతు నాయకులు రాయల లీలా ప్రసాద్, రంగాపురం అశోక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి దొండపాటి రాము, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బొధుగోళ్ళ ప్రేమరాజ్, TNTUC రాష్ట్ర నాయకులు రెంటపల్లి శ్యామ్, మైలవరం మండల ప్రధాన కార్యదర్శి చల్లా సుబ్బారావు, రాజగోపాల్, మొద్దులపర్వ రాఘవులు, అన్నెరావుపేట రమేష్, రెడ్డిగూడెం మండలం తెలుగు యువత మాజీ అధ్యక్షులు పాలంకి సురేష్ రెడ్డి, తొర్లికొండ వెంకటరమణ, బండారు కొండా, పూల వెంకటేశ్వరావు, నాగుల రవి, ఐ టి డి పి జిల్లా అధ్యక్షుడు అద్దేపల్లి శివ,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేశినేని భవన్

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket